కొరటాల శివ పారితోషికం తెలిస్తే షాకే!

Koratala Siva taking 10 crores for movie

04:13 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Koratala Siva taking 10 crores for movie

తొలుత ఎన్నో చిత్రాలకు మాటల రచయితగా పని చేసిన కొరటాల శివ ఆ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి సినిమా తెరకెక్కించి ప్రభాస్ ను మాస్ కు మరింత దగ్గర చెయ్యడమే కాకుండా మొదటి చిత్రమే ఘన విజయం సొంతం చేసుకున్నాడు. రెండో సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో శ్రీమంతుడు తెరకెక్కించి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. దీంతో కొరటాల శివ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. వరుస హిట్స్ రావడంతో, పైగా స్టార్ హీరోలతో తెరకెక్కించి ఘన విజయాలు సాధించడంతో కొరటాల శివ రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచేసాడు.

మొదటి సినిమాకి ఎంత తీసుకున్నారో తెలీదు కానీ, శ్రీమంతుడు చిత్రానికి మాత్రం 3 కోట్లు తీసుకున్నాడు. అది భారీ హిట్టవ్వడంతో, రెమ్యునరేషన్ తో పాటు మహేష్ నుంచి మంచి కార్ కూడా గిఫ్ట్ కొట్టేశాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రం తెరకెక్కించడానికి ఏకంగా 8 కోట్లు తీసుకున్నాడట. ఇక త్వరలో తన స్నేహితుల నిర్మాణంలో ఒక సినిమా, డివివి దానయ్య నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్న కొరటాల శివ, ఆ రెండు చిత్రాల్లో ఒక్కోదానికి దాదాపు పది కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. ఇలా వరుస హిట్స్ తో కేవలం నాలుగు సినిమాలకే పదికోట్ల మార్కును కొరటాల అతి తక్కువ సమయంలోనే రీచ్ అయిపోయాడు.

English summary

Koratala Siva taking 10 crores for movie