బహ్మానందం కామెడీ పై కోట షాకింగ్‌ కామెంట్స్‌

Kota serious comments on brahmanandam

12:33 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Kota serious comments on brahmanandam

బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్యనటుడు. అదే విధంగా కోట శ్రీనివాసరావు కూడా మంచి గుర్తింపు పొందిన నటుడు. వీరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు ఓ పత్రికకు తన కెరీర్‌ కి సంబంధించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మాంనందం మీద ఆయన చేసిన కామెంట్‌ చర్చనీయాంశం అయింది. బ్రహ్మానందం ఒక అద్భుతమైన నటుడు. ఆయనకి కోపం వచ్చినా పర్యాలేదు. బ్రహ్మానందం ఆరేళ్లుగా ఒకే వేషం మీద బతుకుతున్నాడు. ఏ విధమైన పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలిగిన నటుడు బ్రహ్మానందం. కాని ఒకే పాత్రకే పరిమితం అయిపోయాడు. చెప్పి చేయించు కోవడంలో ఉంటుంది అంతా. బ్రహ్మానందంకి రొటీన్‌ పాత్రలు ఇస్తున్నారు. ఇటీవల వస్తున్న ప్రతీ చిత్రంలో బ్రహ్మానం దాన్ని కొట్టడం అది చూసిన జనం నవ్వడం ఇదేనా కామెడీ అంటే ? అంటూ స్పందించారు కోటగారు.

అంతేకాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న హీరోల డామినేషన్‌ మీద కూడా కోట స్పందించారు. తన హయాంలో రూపొందించిన చిత్రాలలో హీరోతో పాటు సరిసమానంగా విలన్‌కి కూడా ప్రాధాన్యత ఉండేది. సత్యనారాయణ, రావుగోపాలరావు మొదలగు వారికి మంచి గుర్తింపు ఉండేది. ప్రస్తుతం హీరోల డామినేషన్‌ పెరిగిపోయిందని అన్ని రకాల షేడ్స్‌ హీరోలే చేయడం వలన విలన్‌ పాత్ర కామెడీగా మారిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఇతర బాషా నటులకు కూడా ఇక్కడ ప్రాధాన్యత పెరిగిపోయింది. నానపాటేకర్‌, నసీరుద్దీన్‌ షా లాంటి గొప్పనటుల ప్రక్కన చిన్న వేషాలు వేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నటన తెలుగు బాష రాని పరబాష విలన్స్‌ ముందు చిన్నపాత్రలు చేయడం నాకు నచ్చదని సూటిగా చెప్పేసారు కోట.

English summary

Kota serious comments on brahmanandam. Kota Srinivas Rao made controversial remarks on Brahmanandam ‘s career. Padma sri  Kota Srinivasa Rao made some serious comments over the current Telugu comedy actor brahmanadam comedy