ఇందిరమ్మ గురించి లోకానికి తెలీని నిజాలు

KP Mathur Launched Book Indira Gandhi

04:08 PM ON 13th May, 2016 By Mirchi Vilas

KP Mathur Launched Book Indira Gandhi

ఈ దేశంలో గాంధీ ఫ్యామిలీలో అత్యంత ప్రాజాదరణ వుంది. అందునా శక్తివంతమైన మహిళగా, దీరన వనితగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీకి ఆరోజుల్లో ఎంతో ప్రజాదరణ వుండేది. ఇందిరమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన ఇందిరా గాంధి ఎన్నో కీలక నిర్ణయాలతో తానేమిటో నిరూపించింది. అయితే ఆమె జీవితానికి సంబంధించిన చాలా అంశాల్ని క్రోడీకరించి, ఒక పుస్తకంగా తయ్యారు చేసారు. అది ఎవరంటే  వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన కేపీ మాథుర్. ఈయన తాజాగా "అన్ సీన్ ఇందిరాగాంధీ" పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఆయన రాసిన పుస్తకం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నో అంశాలు ఇందులో పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి:గోమూత్రం పై పన్ను బాదుడు

ఇవి కూడా చదవండి:కడుపులో బిడ్డ ఎందుకుతంతాడో తెలుసా ?

సఫర్ద్ జంగ్ ఆసుపత్రిలో మాజీ డాక్టరైన మాధుర్ 20 ఏళ్లు ఇందిరమ్మకు డాక్టర్ గా వ్యవహరించారు. ఆమెను అత్యంత దగ్గరగా చూసిన మాథుర్.. ఆమెకు సంబంధించిన అంశాల్ని ఒక పుస్తకంగా రాయటం ఓ విశేషమైతే , దానికి ముందుమాటను ఇందిరమ్మ మనమరాలు ప్రియాంకగాంధీ రాయటం మరో విశేషం. ఈ పుస్తకంలో ఇందిర కోడళ్లు అయిన సోనియా.. మేనక గాంధీలకు సంబంధించిన పలు అంశాల్ని ప్రస్తావించటమే కాదు..వీరిద్దరికి సంబంధించి వచ్చే చాలా సందేహాలకు ఈ పుస్తకం సమాధానంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ పుస్తకంలో ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. అందులో కొన్ని ఇలా వున్నాయి.

1/7 Pages

సంజయ్ గాంధీ మరణించిన తర్వాత ఇందిర తన చిన్న కోడలు మేనకగాంధీ వైపే మొగ్గు చూపారు. కానీ.. ఆమె ఇందిరకు దగ్గర కాలేకపోయారని ఈ పుస్తకంలో డాక్టర్ మాధుర్ ప్రస్తావించారు. రాజకీయ అంశాల్లో మేనకను ఆమె అత్త ఇందిరమ్మ పట్టించుకోకపోవటానికి కారణం ఆమెలో మంచి రాజకీయ దృక్కోణం ఉండటమేనట.

English summary

Ex Indian Prime Minister Indira Gandhi's personal Doctor named KP Mathur was written a book on Indira Gandhi Named" The Unseen Indira Gandhi". In this book he published so many interesting facts and things of Indira Gandhi.