సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు

Kris Sanchez earning money with tweets in social media

04:55 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Kris Sanchez earning money with tweets in social media

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లు చాలామంది జీవితాల్లో భాగమైపోయాయి. అందుకే చాలామంది గంటల తరబడి వాటితోనే కాలం వెల్లదీస్తున్నారు. ఓ యువకుడు అయితే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు. కానీ, ఆ నిర్ణయమే అతనికి కోట్లు కురిపిస్తోంది. సోషల్ మీడియా అంటే ప్రాణం ఇచ్చే 29 ఏళ్ల యువకుడు క్రిస్ సాంచే. ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులతో పంచుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే అతనికి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇలా అధిక సమయం సోషల్ మీడియాలో గడపడం కోసం ఉద్యోగం కూడా వదులుకున్నాడు క్రిస్. కొన్ని రోజుల తర్వాత 'ఉబర్ ఫ్యాక్ట్స్' పేరుతో ఓ ఖాతా తెరిచి అందులో అత్యంత ఆసక్తికర విషయాలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు. దీంతో అతని ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లతో కలిపి క్రిస్ ఫాలోవర్ల సంఖ్య కోటీ ఎనభై లక్షలు. ఆ ఫాలోయింగే ఇప్పుడు క్రిస్ కు కోట్లు తెచ్చిపెడుతోంది. కొన్ని వెబ్ సైట్లు, పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ వెబ్ సైట్లు కొంత ఆసక్తికర సమాచారాన్ని క్రిస్ అకౌంట్లో పెడతాయి.

పూర్తి సమాచారం కావాలంటే క్లిక్ చేయండి అంటూ తమ సైట్ అడ్రస్ ఇస్తాయి. అలా ఎంత మంది క్రిస్ అకౌంట్ నుంచి సదరు వెబ్ సైట్లకు మళ్లుతున్నారో లెక్కగట్టి అంత డబ్బు క్రిస్ కు అందిస్తాయి. ఇక పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్ అకౌంట్లో తమ ప్రకటనలు పెట్టుకుని డబ్బులు చెల్లిస్తాయి. ఇలా పలు మార్గాల ద్వారా క్రిస్ ఏడాదికి మూడు కోట్ల రూపాయలపైనే సంపాదిస్తున్నాడు. మొత్తానికి ఉద్యోగాన్ని వదిలి సాహసం చేసిన క్రిస్ తనకు ఇష్టమైన రంగంలోనే డబ్బులు సంపాదిస్తున్నాడు. మరి క్రిస్ కు ఇంకా ఎన్ని కోట్లు తెచ్చిపెడతాయో చూద్దాం మరి.

English summary

Kris Sanchez earning money with tweets in social media