అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

Krish Donates National Award Prize Money to a Hospital

09:40 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Krish Donates National Award Prize Money to a Hospital

తక్కువ చిత్రాలతోనే ఓ రేంజ్ కి చేరిన ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి ప్రస్తుతం క్రిష్‌ బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నాడు. కంచె, కృష్ణం వందే జగద్గురం, గమ్యం, వేదం లాంటి చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన క్రిష్‌ లో దాన గుణం కూడా బానే వుంది. ఎందుకంటే, క్రిష్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం "కంచె" చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరగగా క్రిష్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు. ఈ అవార్డు కింద వచ్చిన డబ్బును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నట్లు క్రిష్‌ ప్రకటించాడు. తన తల్లితో పాటు ఎందరో క్యాన్సర్‌ బాధితులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నందుకు అవార్డు సొమ్మును ఆ ఆస్పత్రికి విరాళంగా ఇస్తున్నట్లు క్రిష్ చెప్పుకొచ్చాడు. ప్రాంతీయ భాషలో ఉత్తమ చిత్రం విభాగంలో ‘కంచె’ సినిమా అవార్డును సొంతం చేసుకోవడంతో, స్వయంగా క్రిష్ ఈ అవార్డు అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

కోహ్లి పై కోపంతో కుర్చీలను తన్నిన గంభీర్‌(వీడియో)

వధువు కనిపిస్తే హాయిగా ముద్దులు పెట్టుకోవచ్చట

అతన్ని చూసి పారిపోయిన హీరోయిన్

English summary

Director Krish's Kanche Movie won Nationa Award For Best Regional Movie. Yesterday the ward was awarded in Delhi by President Pranab Mukherjee and Krish donated that money to Basava Tarakam Indo American Cancer hospital.