బాలయ్య కోసం వరుణ్ ని పక్కన పెట్టేసాడు 

Krish To Direct Balakrishna 100th Movie

05:09 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Krish To Direct Balakrishna 100th Movie

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టొరీలతో సినిమాలు చేసే క్రిష్ కుఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా మంచి పేరుంది. గమ్యం , వేదం , కంచె వంటి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ తో క్రిష్ "రాయబారి" అని సినిమాను ప్లాన్ చేసాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుండగా ఈ చిత్రాన్ని పక్కన పెట్టాడు క్రిష్. క్రిష్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టడానికి ప్రాధాన కారణం ఈ సినిమాను 90% విదేశాలలోనే చిత్రీకరణ జరపాలాట అందు కోసం లొకేషన్స్ ని చూసి వచ్చిన చిత్ర యూనిట్ కు ఆ దేశాలలో అనుమతి ఇవ్వలేదట.

దీంతో క్రిష్ బాలకృష్ణను లైన్ లో పెట్టే పని లో పడ్డాడు. క్రిష్ ఒక చారిత్రాత్మిక కథను బాలకృష్ణ ను కలిసి చెప్పాగా ఆ కదా బాలయ్య కు బాగా నచిందట. ఈ కథ పై బాగా ఆసక్తి చూపించిన బాలయ్య క్రిష్ కు పచ జెండా ఉపాడని సమాచారం. అయితే బాలయ్య ఇప్పటికే తన 100వ సినిమాను సింగీతం శ్రీనివాస రావు డైరక్షన్ లో చేయ్యనుండగా క్రిష్ కథ విన్న బాలయ్య సింగీతం శ్రీనివాస రావు కథ ను పక్కన పెట్టి క్రిష్ తో తన 100వ సినిమాను చెయ్యాలని భావిస్తున్నాడని సమాచారం.అన్ని అనుకున్నట్టుగా కుదిరితే బాలయ్య 100వ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ క్రిష్ కు దక్కినట్టే.

English summary

Director Krish to direct Balakrishna 100th film.Recently Director Krish said one historical story to Bala Krishna and balayya likes that story line very much.Balakrishna was thinking to do this movie as his 100th movie.