దానికి ఓ హద్దు వుందిగా

Krishna Gadi veera prema Gaadha Heroine About Her Role In The Movie

12:39 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Krishna Gadi veera prema Gaadha Heroine About Her Role In The Movie

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఈ నెల 12న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహాలక్ష్మి పాత్రతో తెరంగేట్రం చేసిన మెహరీన్‌ ఇప్పటివరకు కొన్ని వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గా పని చేసింది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తో ప్రేక్షకాభిమానాన్ని పొందుతానంటోంది ‘ప్రేక్షకుల్ని అందాలతోనే కాదు భావాలతోనూ ఆకట్టుకోవాలి' అని చెబుతోంది. షోకేస్‌లో బొమ్మలా కాకుండా పాత్రకు తగ్గ భావాలను పలికించే నటిగా పేరు తెచ్చుకోవాలనుందని ఈ ముద్దుగుమ్మఅంటోంది. ‘‘సంప్రదాయ దుస్తుల్లో సహజ అందంతో అలరించే మహాలక్ష్మిగా ఈ సినిమాలో కనిపిస్తా. పొగరు, ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న రాయలసీమ అమ్మాయి పాత్ర అది. అలాంటి మహాలక్ష్మి కృష్ణగాడిని ప్రేమిస్తుంది. మరి అతడిని ఎలా చేరుకోగలిగిందనేదే ఈ సినిమా. నాని చెప్పిన మెలకువలు, హనుగారిచ్చిన సలహాలతో బెరుకు లేకుండా నటించా. ఈ సినిమాతో నాకు తొలి విజయం దక్కుతుందనే నమ్మకముంది' అని వివరించింది. ఇప్పుడిప్పుడే కొన్ని అవకాశాలొస్తున్నాయని మెహరీన్‌ అంటోంది. అయితే గ్లామర్‌ పాత్రలు చేసినా వాటికి ఓ హద్దు వుండాలి. నేను అలా ఉండేలా చూసుకుంటా’’అని మనసులో మాట చెప్పేసింది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు కాగా, అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. .

English summary

Krishna Gadi veera prema Gaadha movie fame Heroine Mehrene Kaur Pirzada was previously acted as model in few advertisements. She says that she will look traditional in her upcoming movie Krishna Gadi veera prema Gaadha.She also says that she wanted to do good characters which a more scope on acting