కృష్ణవంశీ 'ఖడ్గం 2'

Krishna Vamsi doing Khadgam sequel

03:37 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Krishna Vamsi doing Khadgam sequel

రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంతో రవితేజ కి మంచి బ్రేక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే కృష్ణవంశీ రామ్‌చరణ్‌తో ‘గోవిందుడు అందరి వాడేలే’ చేశాక చాలా గ్యాప్ ఇచ్చేశాడు. అనుష్కతో ‘రుద్రాక్ష’ ప్రాజెక్ట్‌తో సెట్స్‌ పైకి వెళ్తాడని భావించినప్పటికీ అది కూడా వార్తలకే పరిమితమైంది. ఈలోగా బాలయ్యతో 100వ సినిమాకి ఈ డైరెక్టర్ ప్లాన్ చేసుకున్నాడన్నది మరో రూమర్. వీటిని పక్కనబెడితే.. తాజాగా మరో కొత్త వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తుంది.

అదేంటంటే 2002 లో విడుదలై సూపర్ హిట్ అయిన ఖడ్గం చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ఈ వార్త ఉద్దేశం. ఈ కధ మొత్తం యువ పోలీసు అధికారి పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇందులో హీరోగా సందీప్ కిషన్‌, హీరోయిన్ లుగా కాజల్ అగర్వాల్, లావణ్య త్రిపాఠీలు నటించబోతున్నారు. ఇంకా సుదీప్, ప్రకాష్‌రాజ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారట. అయితే ఈ చిత్రం గురించి కృష్ణవంశీ అధికారికంగా ప్రకటిస్తే తప్ప అది నిజమో కాదో తేలదు.

English summary

Krishna Vamsi doing Khadgam sequel. In this movie Sundeep Kishan is playing police role. Hot beauty Kajal Agarwal and Lavanya Tripathi is acting as a heroines in this movie. Kicha Sudeepa and Prakash Raj will play supporting key roles.