నేను చనిపోయినట్టే.. కృష్ణ వంశీ ఇలా ఎందుకన్నట్టు?

Krishna Vamsi Gives Clarity On Divorce Rumours With Ramya Krishna

11:22 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Krishna Vamsi Gives Clarity On Divorce Rumours With Ramya Krishna

సినిమా వాళ్ళ లైఫ్ లు మామూలు జనం కన్నా డిఫరెంట్ గా ఉంటాయి. అలా కలుస్తుంటారు .. ఇలా విడిపోతుంటారు. కొందరు కల్సున్నా ఎవరి దారి వాళ్లదే అన్నట్లు వుంటారు. మరికొందరు తప్పదురా అన్నట్టు కల్సి వుంటారు. ఇందులో వెర్సటైల్ డైరెక్టర్ కృష్ణ వంశీ - బ్యూటీ రమ్యకృష్ణ ల జంట కూడా ఓ డిఫరెంట్ గా ఉంటుంది. నా మెంటాలిటిని మార్చడానికి నాభార్య రమ్యకృష్ణ ఎన్నోసార్లు నాతో ఆర్గ్యుమెంట్లకు దిగింది. కానీ మారని నా మస్తత్వాన్ని చూసి చివరకు సైలెంట్ అయిపోతుంటుందని తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వూలో కృష్ణ వంశీ చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ మార్చలేరంటూ కామెంట్స్ చేసే రమ్య నా లైఫ్ లో దొరికిన ఏంజెల్ అని కృష్ణవంశీ కితాబిచ్చాడు. అయితే ఇంత ఫీరోషియస్ గా ఎందుకు మీడియా ముందు కొచ్చాడో తెలుసుకోవాలనుంటే, ... ఓ సారి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

తానేదో నష్టాల్లో ఉండి తన భార్య దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కృష్ణ వంశీ చెప్పేసాడు. రమ్యకృష్ణ నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకోలేదనీ, అటువంటి పరిస్థితే ఎదురైతే మరుక్షణం చనిపోయినట్లే అంటూ తనపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చాడు. చాలామందికి విషయాలు తెలియక రమ్యకృష్ణ నాకు విడాకులు ఇచ్చిందన్న రూమర్స్ పుట్టించారని, ఆ వార్తలను తాను పట్టించుకోనని మీడియాపై కొంచెం ఘాటుగానే స్పందించాడు. నేను తీసిన సినిమాలలో కొన్ని ఫెయిల్ అయినా, దర్శకుడుగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని సినిమాల గురించి కృష్ణవంశీ చెప్పేమాట. సో రమ్యకృష్ణ - కృష్ణ వంశీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదంటారా? ఉందంటారా? అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇది కూడా చూడండి: ఆఫీసుల్లో పాలిటిక్స్ కి చెక్ పెడతారా? అయితే చాణక్యసూత్రాలు తెలుసుకోండి

ఇది కూడా చూడండి: ఇవి పాటిస్తే ఆర్థిక సమస్యలన్నీ హుష్ కాకీ.. ఇక డబ్బే డబ్బు!

ఇది కూడా చూడండి: బల్లిని చంపితే... పాపం చుట్టుకుంటుందా?!

English summary

Krishna Vamsi Gives Clarity On Divorce Rumours With Ramya Krishna.