ప్రిన్స్ 'మురారి' పాటపై రచ్చరచ్చ.. గతం తవ్విన కృష్ణవంశీ

Krishna Vamsi talks about Murari movie song

10:43 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Krishna Vamsi talks about Murari movie song

ఓ సినిమా తీయడం చాలా కష్టం... చాలా సాధక భాదకాలు ఉంటాయి. డాన్స్, పాటలు, డైలాగులు ఇలా ఎదో ఓ చోట పేచీ అంటూ ఉంటుంది. ఇక తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఓ యాభై పాటలు తీస్తే, అందులో మురారి సినిమాలోని అలనాటి రామచంద్రుడికన్నింట సాటి అనే పాటకు కచ్చితంగా చోటుంటుంది. తెలుగులో గత రెండు మూడు దశాబ్ధాల్లో వచ్చిన అత్యుత్తమ పాట ఇదే అన్నా అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా ఆ పాటను డైరెక్టర్ కృష్ణవంశీ తీర్చిదిద్దాడు. అయితే ఆ పాటను సినిమాలో పెట్టడానికి హీరో మహేష్ బాబుతో పాటు నిర్మాత ఇతర యూనిట్ సభ్యులు కూడా ఒప్పుకోలేదట. ఓ దశలో ఈ పాట విషయంలో పేచీ వచ్చి సినిమా నుంచి తప్పుకోవడానికే కృష్ణవంశీ సిద్ధమయ్యాడట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారం గురించి ఆసక్తికర విశేషాలు చెప్పాడు కృష్ణవంశీ. మురారి సినిమాలో చివర్లో వచ్చే పాట విషయంలో పేచీ నడిచింది. అప్పటికి ఓ 20 ఏళ్లుగా తెలుగులో సినిమాల్లో ఓ ఆనవాయితీ నడుస్తోంది. సినిమా చివర్లో ఓ మాంచి మాస్ పాట పడాలి. మురారి సినిమాలో కూడా హీరో.. నిర్మాత.. యూనిట్లో అందరూ అలాంటి పాటే కావాలని పట్టుబట్టారు. పెళ్లి పాట ఏంటని విసుక్కున్నారు. దీంతో నాకు ఒళ్లుమండిపోయింది. వేరే దర్శకుడుని పెట్టుకుని, డ్యాన్స్ మాస్టర్ తో మీకు కావలసిన పాట తీసుకోమన్నా. నా పేరు తీసేసి సినిమా రిలీజ్ చేసుకోమన్నా. ఆ పాట మినహా ఫస్ట్ కాపీ ఇచ్చేస్తానని.. ఇప్పట్నుంచి ఈ సినిమాకి ఎవరు డెరైక్షన్ చేసినా నాకు ఓకే అంటూ నో అబ్జక్షన్ లెటర్ కూడా రాస్తానన్నా.

అలా ఎలా కుదురుతుంది అన్నారు. అలాగైతే ఆ పాట ఉంటుందని.. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమని తేల్చి చెప్పాను. ఎలాగైనా ఆ పాట పెట్టాలన్నది నా పొగరుబోతుతనమా.. నమ్మకమా? ఈ పాట మన పెళ్లిళ్ల గతినే మార్చేసింది అని కృష్ణవంశీ చెప్పాడు.

English summary

Krishna Vamsi talks about Murari movie song