కృష్ణవంశీతో బాలయ్య..?

Krishna Vamsi To Direct Balayya 100th Film

12:04 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Krishna Vamsi To Direct Balayya 100th Film

నందమూరి నట సింహం బాలయ్య వందో చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మొదట బోయపాటి.. ఆ తర్వాత సింగీతం.. క్రిష్.. అనీల్ రావిపూడి.. ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పేరు వచ్చి చేరింది. రెండు రోజుల క్రితం కృష్ణ వంశీ బాలయ్యను కలిశాడట. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణవంశీ ఓ సోషియో ఫాంటసీ లైన్ చెప్పాడట. కానీ ఇది ఎంత వరకూ నిజం అనేది స్పష్టం కావాల్సి ఉంది. కృష్ణవంశీ గతంలో శ్రీఆంజనేయం లాంటి సోషియో ఫాంటసీ తీశాడు. ఇప్పుడు రుద్రాక్ష సినిమాపై కసరత్తు చేస్తున్నాడు. బాలయ్యతో ఈ క్రియేటివ్ డైరెక్టర్ మూవీ ఓకే అవుతుందేమో చూద్దాం..

English summary

Confusion on Balakrishna 100th film still continues.Recently another news came to know that director Krishna Vamsi came into the news for Balakrishna's 100th film.