32 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేసిన  రెబెల్ స్టార్

Krishnam Raju Donated 32 Acres Of Land For Andhra Pradesh Government

03:44 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Krishnam Raju Donated 32 Acres Of Land For Andhra Pradesh Government

అవునా, అవుననే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో విభిన్న పాత్రలు పోషించి ,ప్రేక్షకులను మెప్పించి, చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎదిగిన కృష్ణం రాజు అంటే సీనియర్ హీరోగా ఒక మంచి పేరు, గౌరవం ఉంది. సినిమాల్లో హీరోగా ప్రవేశించి.. విలన్ గా మారి, మళ్ళీ హీరోగా ఎన్నో మంచి సినిమాలు చేశారు. నిర్మాతగా ఎన్నో చిత్రాలు అందించారు. ఇక ఆయన సోదరుడి కుమారుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. చిత్ర పరిశ్రమలో కృష్ణం రాజుకు ఎంత మంచి పేరు ఉందో.. నిజజీవితంలో కూడా అంతే పేరు ఉంది. రాజకీయ రంగంలో చేరి , కాకినాడ - నరసాపురం నియోజక వర్గాల నుంచి బిజెపి ఎంపిగా ఎన్నికై , వాజపేయి సర్కార్ లో కేంద్ర మంత్రిగా చేసారు. ఇంకా బిజెపిలోనే ఆయన ఇప్పుడు వున్నారు. ఈవన్నీ పక్కన పెడితే, తాజాగా కృష్ణం రాజు తన మంచి మనసుని మరోసారి నిరూపించుకున్నారు. తనకున్న కోట్ల విలువ చేసే భూములను ప్రభుత్వానికి ఇచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. వివరాల్లోకి వెళ్తే....

రెబల్ స్టార్ కృష్ణం రాజుకి విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ పక్కన దాదాపు 32 ఎకరాలు ఉంది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు ఆ భూమి అవసరం కావడంతో కృష్ణం రాజు ఆ భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని టాలీవుడ్ వర్గాలే కాదు , రాజకీయ వర్గాల వారి నుంచి వినిపిస్తోంది. దీంతో కొంతమంది అంత విలువైన భూమి ఎందుకు ఫ్రీగా ఇస్తారు.. అందుకు బదులుగా ప్రభుత్వం నుంచి మరేదైనా లబ్ధి పొందే అవకాశం ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న స్థితిలో కృష్ణం రాజు చేసిన సాయం చాలా విలువైనదని, ఇలా ప్రముఖులు తమ వంతు సాయంగా ముందుకొస్తే.. ఏపీ త్వరగా కోలుకుంటుందని పలువురు పేర్కొంటున్నారు.

భార్యకు చెప్పకూడని విషయాలు

శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి

సర్దార్ పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

సర్దార్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

అసిస్టెంట్ భార్యకి 25 లక్షలు సాయం చేసిన పవన్

English summary

Rebel Star Krishnam Raju Donated crores worth 32 acres of land which was near to Gannavaram Airport in Vijayawada . He donated this land for zero of coest to Andhra Pradesh Government.Krishnam Raju elected as MP for two times and he also worked as a Central minister during BJP Government.