రాజమౌళిని ఎత్తేసిన రెబెల్ స్టార్

Krishnam Raju Praises Rajamouli

09:42 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Krishnam Raju Praises Rajamouli

రౌద్రం , హుందాతనం , చిలిపితనం ఇలా అన్ని రకాల పాత్రలలో ఒదిగిపోయిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50వసంతాలు అయ్యింది. 1966లో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణం రాజు సినీ స్వర్ణోత్సవం భారీ ఎత్తున చేయాలని ఆయన తమ్ముడు కుమారుడు ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ టివి ఆధ్వర్యాన ఆదివారం రాత్రి గామా అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణం రాజుకి లైఫ్ టైం ఎఛీవ్మెంట్ పురస్కారం అందించారు. అనంతరం ఆయన మాటాడుతూ "ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ అల్లూరి సీతారామరాజు , ఓ బొబ్బిలి బ్రహ్మన్న వంటి చిత్రాలు తెలుగు పరిశ్రమ స్ట్రెన్త్ ఏమిటో చూపించాయి. ఇప్పుడు బాహుబలి ప్రపంచ స్థాయిలో మనం కూడా చిత్రాలు తీయగలమని చాటింది. దీనికి కారకుడు బాహుబలి దర్శకుడు రాజమౌళి" అంటూ ఆకాశానికి ఎత్తేసారు కృష్ణం రాజు. ఈ మాటలు కృష్ణం రాజు అంటున్నప్పుడు రాజమౌళి లేడు గానీ బాహుబలి ప్రభాస్, భాల్లాల దేవుడు రానా , బ్యూటీ తమన్నా , తదితరులు అక్కడే వున్నారు. అందరిలో ఆనందం పెల్లుబిక్కింది.

English summary

Rebel Star Krishnam Raju Praises Tollywood Top Director S.S.Rajamouli on Gama Awards.Krishnam Raju completes 50 years in Tollywood and ETV presented Life Achievement Award to Krishnam Rqaju.He says that Rajamouli's Bahubali proved that we can international standard films.