సూపర్ స్టార్ ని  రెబెల్ స్టార్ ఏమన్నాడు?

Krishnam Raju Speech At Sri Sri Audio Event

03:33 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Krishnam Raju Speech At Sri Sri Audio Event

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ మూవీ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదిక పై అత్యంత ఘనంగా నిర్వహించారు. విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకకు వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేయగా, మరో అతిధిగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు పాల్గొని మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేసాడు. దీంతో ఫంక్షన్ లో ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కృష్ణ నిర్మాతల పాలిట కల్పతరువు అని వున్నాం. డేరింగ్ అండ్ డేషింగ్ గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త హంగులు తెచ్చిన నిజమైన హీరో అని విన్నాం. కానీ ఇలాంటి యాంగిల్ కూడా కృష్ణలో ఉందా' అని అక్కడ కొంతమంది చర్చించుకున్నారు. ఇంతకీ రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఏమన్నారంటే, 'గతంలో నేను కృష్ణ కలిసి చాలా సినిమాలు చేసాం . పరిశ్రమకు ఎంతో చేసాడు. ఆయన విజయం వెనుక విజయ నిర్మల వుంది. ఇక కృష్ణ తో కల్సి నటిస్తున్న రోజులలో కృష్ణ ఆఖరి అమ్మాయిని దత్తత ఇమ్మంటే సరేనన్న గొప్ప మనసు కృష్ణది. ఎవరు ఏమి అడిగినా కాదనలేని బోళాశంకరుడు కృష్ణ ' అని అనడంతో అక్కడి వారంతా కన్న కూతురిని సాటి నటుడుకి దత్తత ఇవ్వడానికి సిద్దపడిన కృష్ణ ది అంత గొప్ప మనస్సా అంటూ చర్చించుకున్నారు. ఇక అభిమానులైతే సంబర పడ్డారు.

English summary

Super Star Krishna acted in a full length movie nemd Sri Sri after a long long time.Yesterday this movie audio was launched.Super Star Krishna Son Mahesh Babu and Krishnam Raju attended as chief guests to this audio release event and said some words about Super Star Krishna.Rebel Star Krishna says that Super Star Krishna was very helpful and he was a very good person.