'కృష్ణాష్టమి' రిలీజ్‌ డేట్‌

krishnashtami movie release date

10:47 AM ON 11th January, 2016 By Mirchi Vilas

krishnashtami movie release date

కమీడియన్‌ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా ప్రమోట్‌ అయిన నటుడు సునీల్‌. సునీల్‌ తాజాగా నటించిన చిత్రం 'కృష్ణాష్టమి'. 'జోష్‌' ఫేమ్‌ వాసు వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఈ చిత్రంలోని పాటలు శనివారం (జనవరి 9) అంగరంగ వైభవంగా విడుదలయ్యాయి. ఈ ఆడియోలో విడుదల చేసిన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఘాటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయినా ఈ చిత్రం విడుదలకి సరైన సమయం కోసం ఎదురు చూసారు. అయితే ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చిత్రం విడుదల తేదీన కూడా అనౌన్స్‌ చేసేశారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

English summary

Hero Sunil latest movie krishnashtami movie is releasing on February 5th. Nikki Galrani and Dimple chopade are romancing with Sunil in this film.