కృష్ణాష్టమి స్టోరీ బన్నీదట

krishnashtami story is written for Allu Arjun

11:25 AM ON 15th February, 2016 By Mirchi Vilas

krishnashtami story is written for Allu Arjun

కామెడీ హీరో నుండి మాస్‌ హీరో గా ప్రమోట్‌ అయిన నటుడు సునీల్‌. 'భీమవరం బుల్లోడు' చిత్రం తరువాత సునీల్‌ దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని నటిస్తున్న తాజా చిత్రం 'కృష్ణాష్టమి'. 'జోష్‌' ఫేమ్‌ వాసువర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌చోపడే హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలవబోతుంది. ఈ సందర్భంగా సునీల్‌ ఒక తాజా విషయం ప్రకటించాడు. అదేంటంటే వాస్తవానికి ఈ చిత్ర కథ అల్లు అర్జున్‌దట. కొద్ది సంవత్సరాలు క్రితం ఈ కథతో బన్నీతో చిత్రం నిర్మిస్తానని దిల్‌రాజు చెప్పారని సునీల్‌ తెలిపాడు. కానీ అదృష్టవసాత్తూ ఈ కథతో హీరోగా నటించే అవకాశం నాకు దక్కిందని పేర్కొన్నాడు.

English summary

Sunil latest movie Krishnashtami is releasing on February 19th. This movie is directed by Vasu Varma. Sunil told about this movie that Krishnashtami story is written for Allu Arjun but luckily i got it. Dimple Chopade and Nikki Galrani is romancing with Sunil in this movie.