సంక్రాంతికి కృష్ణాష్టమి లేదట

Krishnastami Movie Release not in Sankranthi

12:02 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Krishnastami Movie Release not in Sankranthi

భీమవరం బుల్లోడు తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో సునీల్‌ తాజా చిత్రం కృష్ణాష్టమి. ఇందులో సునీల్‌ సరసన నిక్కీ గల్రాని, డింపుల్‌ చోప్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. జోష్‌ఫేమ్‌ వాసువర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా గ్యాప్‌ తరువాత సునీల్‌ ఫుల్‌ అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తున్నాడు. అయితే కృష్ణాష్టమి చిత్రాన్ని ఎప్పుడు విడుదల చెయ్యాలని సందేహం వ్యక్తమయ్యింది.

ఇప్పటికే 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని సంక్రాంతికి పోస్ట్‌పోన్‌ చెయ్యడంతో సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. అవి బాలకృష్ణ డిక్టేటర్‌, ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో మరియు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన. వీటితో కృష్ణాష్టమి రిలీజ్‌ చేస్తే అసలుకే ఎసరు వస్తుందని భావించి కృష్ణాష్టమిని డిసెంబర్‌లోనే రిలీజ్‌ చెయ్యాలని సునీల్‌ నిర్ణయించుకున్నాడు.అయితే సంక్రాంతి బరిలో సునీల్‌ లేనట్టే! డిసెంబర్‌లో రిలీజ్‌ అయ్యే లోఫర్‌, మామ మంచు అల్లుడు కంచు, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలకి పోటీగా సునీల్‌ బరిలోకి దిగుతున్నాడన్నమాట!

English summary

Krishnastami Movie Release not in Sankranthi