ఇమ్రాన్ హస్మీతో కృతి హాట్ సీన్లు!!

kriti kharbanda acting with Imraan Hashmi for liplocks in raaj-4

06:02 PM ON 21st November, 2015 By Mirchi Vilas

kriti kharbanda acting with Imraan Hashmi for liplocks in raaj-4

బాలీవుడ్ లో ఇమ్రాన్ హస్మీతో చిత్రం అంటే అందులో అదర చుంబనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇమ్రాన్ హస్మీ చిత్రాల్లో కథ అంతగా లేకపోయినా ఆ హాట్ హాట్ సీన్లు కోసమే అందరూ వెళ్తారు. ఇప్పుడు ఇమ్రాన్ హస్మీతో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. అదే రాజ్-4, రాజ్ సీరీస్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో పెదవి ముద్దులు, వేడెక్కించే బెడ్‌రూమ్ సీన్లు ఉంటాయని తెలిసిందే. ఇమ్రాన్ హస్మీతో నటించాలంటే ప్రతీ హీరోయిన్ అటువంటి సన్నివేశాలు చెయ్యడానికి సిద్ధపడే వస్తుంది. ఇమ్రాన్ హస్మీతో నటించేది ఉత్తరాధి భామలే కాబట్టి ఇబ్బంది లేకుండా నటిస్తారు. అయితే ఈ సారి మన దక్షిణాది భామ కృతికర్బంద నటిస్తుంది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ 'రమణ గోగుల' నిర్మాతగా మారి తీసిన తెలుగు చిత్రం 'బోణీ'తో కృతికర్బంద తెలుగు తెరకు పరిచయమయింది. ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో కృతికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత మంచు మనోజ్ నటించిన మిర్. నూకయ్య చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఈ చిత్రం కృతికి మంచి బ్రేక్ నే ఇచ్చింది. తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'తీన్ మార్' చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. అది ఫ్లాప్ అవ్వడంతో తరువాత కన్నడ పరిశ్రమకి మఖాం మార్చింది. అక్కడ చేసిన చిత్రాలు హిట్ అవ్వడంతో కన్నడలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. కానీ అసలైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పటి వరకు తను చేసిన పాత్రలన్నీ పద్ధతిగా ఉండేవే.

ఇప్పుడు వచ్చే హీరోయిన్లు అందరు మొదటి సినిమాతోనే అందాలు ఆరబోస్తున్నారు. ఇన్ని సినిమాలు చేసిన కృతి ఇంకా ఓవర్ ఎక్స్పోజింగ్ చెయ్యకపోవడమే తనకి బ్రేక్ రాలేదు అనుకుందో ఏమో తాజాగా ఇమ్రాన్ హస్మీ చితంలో హాట్ హాట్ గా నటించడానికి సిద్దమయింది. ఇప్పటి వరకు సౌందర్యలా పద్ధతిగా నటించిన కృతి ఇప్పుడు ఒకేసారి అందాల విందుని ఇవ్వబోతుంది. ఈ సినిమాతోనైనా కృతి జోరు పెరగాలని కోరుకుందాం.

English summary

kriti kharbanda acting with Imraan Hashmi for liplocks in raaj-4