ఫటాఫట్ పంచ్ లు విసురుతున్న ప్రిన్స్ హీరోయిన్

Kriti Sanon doing boxing for fitness

12:53 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Kriti Sanon doing boxing for fitness

వాస్తవానికి హీరోయిన్లంటే మెత్తని దూదిపింజల్లా, ముట్టుకుంటే మాసిపోయేలా, పట్టుకుంటే కందిపోయేలా.. ఉండాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు తీరు మారింది. ఎందుకంటే, నేటితరం ముద్దుగుమ్మలంతా ఫిట్ నెస్ విషయంలో కనబరుస్తున్న శ్రద్ధ తక్కువేం కాదు. కడుపు మాడ్చకుని కొవ్వు కరిగించడంలో ఎవరికి వారే సాటి అన్నట్టు చెమటోడుస్తున్నారు. ఈ విషయంలో మహేష్ '1 నేనొక్కడినే'లో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ ఓ రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే బాక్సింగ్ గ్లౌజులు చేతికి తొడుక్కుని ఫటాఫట్ పంచ్ లు విసురుతోంది. ఇక ఆమె ఇచ్చే కిక్స్ కి బ్యాగ్ పగిలిపోయేలా ఉందట.

ఒలింపిక్స్ కోసం సాధన చేస్తున్నట్టు ఇంత తీవ్రంగా శ్రమిస్తోన్న కృతిని చూసిన కొందరు ఓ సినిమా కోసమే ఇదంతా అని చెవులు కొరుక్కున్నారు. ఈ విషయం తనదాకా వచ్చేసరికి స్పందించిన కృతి బాక్సింగ్ కి సినిమాకి అసలేమాత్రం సంబంధం లేదని, ఇదంతా కేవలం ఫిట్ నెస్ కోసమేనని బదులిచ్చిందట. అదీ సంగతి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కృతి సైన్ చేసిన రాబ్తా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటివరకూ తెలుగులో రెండు, హిందీలో రెండు చొప్పున సినిమాలు చేసిన ఈ అమ్మడుకి ఒక్కటంటే ఒక్కటీ హిట్ రాలేదు. మరి ఇప్పుడైనా హిట్ తో సందడి చేస్తుందా లేదా?

English summary

Kriti Sanon doing boxing for fitness