బాలీవుడ్ జంటని విడదీసిన కృతి సనన్

Kriti Sanon is the reason for Sushant Singh Rajput breakup

01:17 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Kriti Sanon is the reason for Sushant Singh Rajput breakup

ఇటీవ‌ల బాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీల మ‌ధ్య బ్రేక‌ప్‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఈ కోవ‌లోనే బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్-అంకితా లోఖాండే కూడా విడిపోయారు. వీరిద్ద‌రి బ్రేకప్ విషయాన్ని బయట పెట్టింది సుశాంతే. అంతటితో ఆగకుండా అంకితాతో విడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నాడు. సుశాంత్ చెపుతున్న దాని ప్ర‌కారం ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటి అంకితా ఫుల్లుగా తాగి లవర్ సుశాంత్ పై నోరు పారేసుకుందట. ఇష్టం వచ్చినట్లు సుశాంత్ ను తిట్టిందట. ఈ విషయాలు ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ఇక సుశాంత్, అంకితల బ్రేకప్‌కు మ‌రో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

ప్రిన్స్ మ‌హేష్‌బాబు 1- నేనొక్క‌డినే చిత్రంలో హీరోయిన్ గా న‌టించిన కృతి స‌న‌న్ సుశాంత్‌-అంకిత విడిపోవడంలో కృతి కీలకపాత్ర పోషించిన‌ట్టు బాలీవుడ్ లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేదని బాలీవుడ్ టాక్. సుశాంత్ చెపుతున్న దాన్ని బ‌ట్టి చూస్తే అంకితా తాగుడుకు హద్దు లేదని, ఆ తర్వాత ఆమె కంట్రోల్ లో ఉందడని తేలిపోయింది. కరెక్టుగా ఆ సమయంలో సుశాంత్ మిగతా సెలబ్రిటీలతో చాలా చనువుగా మెలగడం కూడా అంకితాకు కోపం తెప్పించిందని అందుకే వీరి బంధం బ్రేక‌ప్ అయిన‌ట్టు టాక్‌.

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

English summary

Kriti Sanon is the reason for Sushant Singh Rajput breakup. Hot beauty Kriti Sanon is the reason for Sushant Singh Rajput love breakup.