డేటింగ్ గురించి మహేష్ బ్యూటీ ఏమందంటే..

Kriti Sanon Responds To The Sushant Dating Rumours

11:33 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Kriti Sanon Responds To The Sushant Dating Rumours

మహేష్ నటించిన వన్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన కృతిసనన్, ఆ తర్వాత ‘దోచెయ్’లోనూ నటించింది. వీటితోపాటు బాలీవుడ్లో దిల్వాలే, హీరోపంటి వంటి సినిమాలు కృతికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఈ అమ్మడి డేటింగ్ గురించి రకరకాల వార్తలు వచ్చేస్తున్నాయి. అయితే తనపై వస్తున్న గాసిప్స్‌కు మహేష్ బ్యూటీ కృతిసనన్ ఫుల్స్టాప్ పెట్టేసింది. సుశాంత్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్టు చక్కర్లు కొడుతున్న వార్తలను కృతి ఖండించింది. అసలు సుశాంత్‌ను తాను కలుసుకోలేదని, ఇంతకంటే వివరణ ఇవ్వడానికి ఏమీలేదని స్పష్టం చేసింది. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది. డేటింగ్ వార్తలపై స్పందించకుండా ఉండటమే మంచిదని తొలుత భావించానని, కానీ వరసగా స్టోరీలు రావడంతో వివరణ ఇచ్చానని, అంతకుమించి చెప్పాల్సిందేమీ లేదని అంటోంది.

ఎట్ ప్రజెంట్ ‘రబ్తా’ మూవీలో నటిస్తున్న కృతి, అందులో హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్లో వున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసిన విషయం తెల్సిందే!

ఇది కూడా చూడండి: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి కొత్త చిత్రం వరకు పవన్ డిఫరెంట్ లుక్స్

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో శృంగారం చేస్తే వేసే శిక్షలు ఏంటో తెలుసా?

ఇది కూడా చూడండి: రోడ్లపై తెలుపు, పసుపు రంగు గీతలు వేసేది ఇందుకేనా...

English summary

Kriti Sanon Responds To The Sushant Dating Rumours.