హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ మరదలు

Kriti Sanon sister Nupoor Sanon giving entry as a heroine

05:48 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Kriti Sanon sister Nupoor Sanon giving entry as a heroine

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు మ‌ర‌ద‌లు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. మ‌హేష్ మ‌ర‌ద‌లు హీరోయిన్‌గా రావ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా? అయితే షాక్ అవ్వకండి అసలు విషయంలోకి వెళ్లిపోదాం.. మ‌హేష్‌బాబు-సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన '1- నేనొక్క‌డినే' సినిమాలో మ‌హేష్‌కు జోడీగా న‌టించిన పొడవు కాళ్ళ సుందరి కృతీస‌న‌న్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అంద‌చందాల‌తో మైమ‌రిపించింది. ఆ తరువాత అక్కినేని నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఇటు ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం, అటు ఆమె హైటు కూడా సమస్యగా మారడం వలన ఇక్కడ అవకాశాలు రాలేదు.

దాంతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవడానికి కృషి చేస్తోంది. కృతి తాజాగా త‌న చెల్లెలు ‘నుపూర్ సనన్’ ను కూడా కథానాయికగా పరిచయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఆమె ప్రయత్నాలు త్వరలో ఫలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే కథానాయికలు తమ చెల్లెళ్లను ఫీల్డ్ లోకి తీసుకురావడమనేది చాలా కాలంగా ఉన్నదే. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ద్వారా త‌న చెల్లికి సినిమాల్లో ఛాన్సులు ఇప్పించేందుకు కృతి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

English summary

Kriti Sanon sister Nupoor Sanon giving entry as a heroine. Hot beauty Kriti Sanon sister Nupoor Sanon is giving entry as a heroine.