ఫస్ట్ లుక్ కి 'క్షణం' చాలు 

Kshanam Movie First Look

09:58 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Kshanam Movie First Look

పివిసి సినిమా అంటేనే ఓ క్రేజ్ వుంటుంది. పైగా ఓ వైపు తెలుగు, తమిళ భాషల్లో వరుస భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ దూసుకు పోతున్న పీవీపీ సినిమా, మరోవైపు పూర్తిగా కొత్తదనం జోడించి, చిన్న సినిమాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా అడవి శేష్ హీరో గా ‘క్షణం’ అనే ప్రయోగాత్మక సినిమాను సిద్ధం చేసింది. రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం హైద్రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి, దర్శకుడు రవికాంత్, హీరో అడవి శేష్, అనసూయ, సత్యదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ళ పాపను వెతికే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు.

“పీవీపీ సంస్థలో మంచి కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు కూడా చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. మంచి కథతో వస్తే కొత్తవాళ్ళతో చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఒక థ్రిల్లింగ్ కథతో ‘క్షణం’ సినిమా తెరకెక్కింది. మార్చి 4న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాం” అని పివిపి తెలిపారు. “మొదటి సినిమానే పీవీపీ సినిమా లాంటి పెద్ద సంస్థలో చేసే అవకాశం రావడం అదృష్టం. క్షణం అందరినీ మెప్పించే థ్రిల్లింగ్ కథతో తెరకెక్కింది. అడవి శేష్‌తో కలిసి ఈ కథ రాసుకున్నా. అందరికీ ఈ సినిమా ఓ కొత్త అనుభూతినిస్తుంది” అని దర్శకుడు రవికాంత్ చెబుతున్నాడు. “ఈ సినిమాలో నేనో పోలీసాఫీసర్‌గా కనిపిస్తా. రియలిస్టిక్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీసారు. విజయం సాధిస్తుందన్న నమ్మకముంది” అని హీరో అడవి శేష్ చెబుతున్నాడు.

English summary

PVP cinemas new project Kshanam movie first look was released recently.One of the official of PVP cinema was said that this movie comes with different story.Adah Sharma,Adavi Shesh,Anasuya Played lead roles in the movie