‘కోటి’ సినిమా అర కోటి ‘పబ్లిసిటీ’

Kshanam Movie Spends 50 Lakhs For Publicity

03:02 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Kshanam Movie Spends 50 Lakhs For Publicity

సినిమా.. ఇప్పుడు జనాలకు ఒక ప్యాషన్. కానీ.. సినిమా తీయడం అంటే బాగా ఖర్చు వ్యవహారం. తక్కువ బడ్జెట్ లో సినిమా తీయడం అంటేనే ఇప్పుడు కష్టమైన వ్యవహారం. కానీ పెద్ద హీరోలతో సినిమాలు తీసిన పీవీపీ బ్యానర్ ఇప్పుడు రూట్ మార్చి చిన్న సినిమాలపై కన్నేసింది. ఈ సంస్థ నిర్మించిన తాజా చిత్రమే క్షణం. ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి అక్షరాలా కోటి రూపాయలు. కొత్త కుర్రాడు రవికాంత్ పెరెపు ఈ చిత్రానికి డైరెక్టర్. అతను చెప్పిన కాన్సెప్ట్ నచ్చి సినిమా అప్పగించింది పీవీపీ బ్యానర్. బడ్జెట్ లిమిటేషన్స్ ఏమి పెట్ట లేదు. కానీ.. డైరెక్టర్ మాత్రం చిత్రాన్ని కోటి రూపాయల్లోపే సినిమాని పూర్తి చేశాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం ఇది ఇంత లో బడ్జెట్ లో తీసిన మూవీ అనిపించదు. దీనికి తోడు దర్శకుడి టేకింగ్ సూపర్ గా ఉండటంతో ‘క్షణం’ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేశాడు. దీంతో పబ్లిసిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు పీవీపీ. అందుకే సినిమాకు కోటి ఖర్చయితే.. పబ్లిసిటీ కోసం అరకోటి ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. అంటే భారీ బడ్జెట్ సినిమాల పబ్లిసిటీతో సమానం అన్నమాట. ఈ నెల 26న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఈ పబ్లిసిటీ ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. అడివి శేష్, ఆదాశర్మ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీలో.. హాట్ యాంకర్ అనసూయ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనపడనుంది.

English summary

Adavi Shesh upcoming movie Kshanam movie was going to release on 26th of this month.This movie was produced by PVP cinema.The budget of this movie was 1 crore and PVP cinema has spend 50 lakhs for the publicity of this movie