గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలతో బాలికను బలివ్వబోయారు!

Kshudra Poojalu for child in Rajamahendravaram

05:39 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Kshudra Poojalu for child in Rajamahendravaram

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ.. బాలికను బలివ్వాలని భావించిన నలుగురిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. కడియం మండలం గుర్లంకకు చెందిన గణపతి, రాజమహేంద్రవరం నారాయణపురంలో ఆరు నెలలుగా నివాసముంటున్నాడు. అతని వద్దకు దేవీపట్నానికి చెందిన వెంకన్నదొర, అమలాపురానికి చెందిన రామ్ కుమార్, రంపచోడవరానికి చెందిన కాణెం పార్వతీ దేవి, ఆమె ఏడేళ్ల కుమార్తె పావనిని తీసుకుని శనివారం సాయంత్రం వచ్చారు. వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు శనివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందడంతో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.

క్షుద్రపూజల సామగ్రితో పాటు కత్తి, రెండు గడ్డపారలను అధికారులు గుర్తించారు. సంఘటనా స్థలంలో బాలిక అపస్మారక స్థితిలో ఉండటాన్ని బట్టి ఆమెను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary

Kshudra Poojalu for child in Rajamahendravaram