సీమాంధ్రులు మా సోదరులేనన్న కెటిఆర్    

KTR About Seemandhra People

06:46 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

KTR About Seemandhra People

గ్రేటర్ ఎన్నికల భారం మోస్తూ, మీటింగ్ లతో దూసుకెళుతున్న తెలంగాణా ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఏర్పాటుచేసేన సమావేశంలో సీమాంధ్రులు మాకు అన్నదమ్ములేనని అన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు ఇబ్బందుల పాలవుతారని, చాలామంది ఆరోపించారని ఆయన గుర్తుచేస్తూ , టిఆర్ఎస్ పాలనలో అలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ‘రెండేళ్ల కింద ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. మాది స్టేట్‌ ఫైట్‌ కానీ, స్ట్రీట్‌ ఫైట్‌ కాదని ఆరోజే చెప్పాం. ప్రాంతాల్లా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. సీఎం కేసీఆర్‌ తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వృద్ధులకు పింఛన్లు పెరిగాయి. ఈరోజు నాగోలులో ఓ వృద్ధురాలిని కలిశా. పింఛన్లు, రేషన్‌ అన్నీ సక్రమంగా అందుతున్నాయని, ఇంట్లో కూడా తనని బాగా చూసుకుంటున్నారని ఆమె చెప్పింది. ఇదంతా తన పెద్ద కుమారుడు కేసీఆర్‌ వల్లేనని ఆమె ఆనందం వ్యక్తం చేసింది’. అంటూ కేటీఆర్‌ ఉపన్యాసం సాగింది. వ్యూహాత్మకంగా ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

English summary

Telangana IT and Panchayiti Raj Minister KTR Says that Seemandhra People were like brothers. He says that all people were living safely in Hyderabad