గ్రేటర్ లో గెలవకపోతే రాజీనామాయే

KTR Challenge On GHMC Elections

05:10 PM ON 11th January, 2016 By Mirchi Vilas

KTR Challenge On GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపధ్యంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు , ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు కోసం వ్యూహం రచిస్తున్న ఐటి మంత్రి కెటిఆర్ గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్100 స్థానాలను గెలుచుకుంటుందని ఆర్‌ ఆశాభావం వ్యక్తం చేస్తూ, గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన సవాల్‌ను స్వీకరించేందుకు ముందుకు వస్తారా? అని ప్రతిపక్షాలకు ఆయన సవాల్‌ విసిరారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఆశ పడటం లేదని, నిజానికి తనకు మంత్రి పదవే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. మరో 15 ఏళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరి కె టి ఆర్ సవాల్ ని విపక్షాలు స్వీకరిస్తాయా , తీసిపారేస్తాయా ....

English summary

Telangana State IT Minister KTR challenges that he will ressign to his minister post if TRS did not win in GHMC elections