మోస్ట్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఐకాన్‌ గా కేటీఆర్‌

KTR elects as Most Inspirational Icon of the year 2015

01:10 PM ON 14th December, 2015 By Mirchi Vilas

KTR elects as Most Inspirational Icon of the year 2015

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) ప్రతిష్టాత్మక రిట్జ్‌, సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ మోస్ట్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఐకాన్‌ 2015 అవార్డును అందుకున్నారు. ఆదివారం బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమంలో లైఫ్‌స్టైల్‌ మేగ్‌జైన్‌ రిట్జ్‌, ఐబిఎన్‌ మోస్ట్‌ ఇన్‌స్పిరేషనల్‌ ఐకాన్‌ అవార్డును కేటీఆర్‌ కు ప్రధానం చేసారు.

భారత్‌లో వివిధ రంగాలలో అద్బుతమైన ప్రతిభ కనబరచిన వారికి అనేక అంశాలను పరిశిలించి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రజాజీవితంలో అసాధారణమైన ప్రతిభ కనబరచిన వారి కేటగిరిలో మంత్రి కేటీఆర్‌ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి పరిశ్రమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కేటీఆర్‌ కు ఈ అవార్డు దక్కింది.

ఈ అవార్డు కమిటీ వారు మాట్లాడుతూ కేటీఆర్‌ తెలివైన నాయకుడని, ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని, ప్రజల అభివృద్ధికి తనదైన శైలిలో సేవలందిస్తున్నారని అన్నారు.

ఈ అవార్డు ప్రధానం చేసిన సందర్భంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఇది వరకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని తెలంగాణా రాష్ట్రంలో తీసుకొచ్చామని, ఇందులో భాగంగానే భారత దేశంలో ఎక్కడాలేని విధంగా అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ లో నెలకొల్పామని అన్నారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నామని వివరించారు.

English summary

Telangana state Information Technology and Panchayat Raj Minister Kalvakuntla Taraka Rama Rao(KTR) has been elected for prestigious national level award called "Most Inspirational Icon Of The Year 2015"