తమ్ముడు అంటూనే చినబాబు పై చురకలు

KTR Fires On Nara Lokesh

09:55 AM ON 28th January, 2016 By Mirchi Vilas

KTR Fires On Nara Lokesh

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో ఆయా పార్టీల నేతలు పదునైన విమర్శలను సంధిస్తున్నారు. వాడీవేడీ ప్రచారం జరుగుతున్న సందర్భంగా ప్రత్యర్థి పై పైచేయి సాధించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అనుసరిస్తున్న వ్యూహం పంచ్ డైలాగులతో హోరేత్తిస్తోంది.తెలంగాణ అధికారపక్షం పై సున్నితంగా విమర్శలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ని తమ్ముడు అని సంబొందిస్తూనే, కేటిఆర్ చురకలు అంటించారు. గ్రేటర్ పగ్గాలు తమకిస్తే హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తమ్ముడు లోకేశ్ చెబుతున్నారని.. ముందు ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలని సలహా ఇచ్చారు. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు నుంచి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేస్తామని చెబుతున్న తమ్ముడు లోకేశ్.. మొదట అమరావతి కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పని మీద దృష్టి పెడితే బాగుంటుందని చురకలేశారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారని.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చారని.. అయితే మోడీ తనతో పాటు తట్టెడు మట్టి.. చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్లారని. కెటిఆర్ ఎద్దేవా చేస్తూ, ఆలాంటిది హైదరాబాద్ కి కేంద్రం నుంచి ఏదో తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్డీయే సర్కారులో పార్టనర్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ తొలుత ఏపీ ప్రజల అవసరాల మీద దృష్టి పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. ఏపీకి అవసరమైన నిధులు తెచ్చుకోలేని ఏపీ సర్కారు.. హైదరాబాద్ కు నిధులు ఎలా తెస్తారంటూ ప్రశ్నించారు. సొంత రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చుకోవటంలో విఫలమవుతున్న వారు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏం చేయగలరన్న ఆయన నిలదీశారు. మొత్తానికి కెటిఆర్ ఓ రేంజ్ లో టిడిపిని ఉతికి ఆరేసారని చెప్పాలి. అయితే గురువారం నుంచి ఎపి సిఎమ్ చంద్రబాబు ప్రచారానికి వస్తున్న నేపధ్యంలో మరిన్ని విమర్శలు , ప్రతి విమర్శలతో ప్రచారం తారాస్థాయికి చేరనుంది.

English summary

Telangana IT and Panchayatraj Minister KTR fires on Nara Lokesh and TDP during GHMC election campaign in Hyderabad.He says that first of all Lokesh have to solve Andhra Pradesh People problems.