భీమవరం బుల్లోడు .....

KTR Said He Will Competition From Bhimavaram

01:51 PM ON 8th January, 2016 By Mirchi Vilas

KTR Said He Will Competition From Bhimavaram

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాకున్నా , ఎన్నికలు జరగడం ఖాయంగా తేలడం, రేపో మాపో షెడ్యూల్ కూడా వచ్చేయడానికి సన్నాహాలు జరగడంతో ఎవరి ఎత్తులు వారు వేస్తుంటే, టిఆర్ఎస్ కాస్త ముందుకు వెళ్ళింది. హైదరాబాద్ లోని ఆంధ్రుల మనసు దోచుకోడానికి , తద్వారా సెటిలర్ల ఓట్లను దండిగా పొందడానికి గులాబిదళం చెబుతున్న మాటలు వినసొంపుగా ఉంటున్నాయి. ఇక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రులను అవమాన పరిచే విధంగా , రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు తీయగా చెబుతున్న కబుర్లు ప్రత్యర్ధులకు మింగుడు పడడంలేదు.

హైదరాబాద్ ని దత్తత తీసుకున్నట్లు , సెటిలర్లె దేవుళ్ళన్నట్లు తన చేతలు , మాటల ద్వారా దూసుకుపోతున్న తెలంగాణ సిఎమ్ కెసిఆర్ కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ అంటే,' తెలుగు రాష్ట్ర సమితా ' అన్నట్లు వున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణా తల్లిని ఫోకస్ చేసి , తెలుగు తల్లి అనడాన్ని కూడా జీర్ణించు కోలేని గులాబి దళం నుంచి ఇలాంటి మాటలు రావడమేమిటని ఆశ్చర్య పోవద్దు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయడానికి కూడా వెనకాడరట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కె టి ఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

గతంలో అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగానికి ఆంద్ర ప్రజలు ఎంతో ముగ్ధులయ్యారని, టీడీపీ నేత ఒకరు స్వయంగా తనకు తెలిపారంటూ కేటీఆర్ పేర్కొంటూ , భీమవరం నుంచి పోటీచేయడానికి తాను వెనుకాడబోనని అన్నారు. అంతేకాదు కోడిపందాలను చట్టబద్దం చేస్తామని అక్కడి ఓటర్లకు హామీ కూడా ఇస్తానన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెప్పకనే చెబుతున్నాయి. సెటిలర్ల ఓట్ల కోసమే కె టి ఆర్ తియ్యగా పలుకుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

English summary

Telangana IT and Panchayati raj minister KTR said that he will competete from Bhimavaram. He said that this in Hyderabad