కేటీఆర్ తో క్రికెట్ దిగ్గజం సెల్ఫీ

KTR Selfie With Sachin Tendulkar

03:26 PM ON 20th May, 2016 By Mirchi Vilas

KTR Selfie With Sachin Tendulkar

ఓ క్రీడా నిపుణుడు , ఓ రాష్ట్ర మంత్రి సేల్ఫీ దిగడం ఆశ్చర్యమే మరి ... రాజకీయాలు చేయడమే కాదు సినిమాలు , క్రీడలపై కూడా మక్కువ గల మంత్రి మరి. అలాగే మరొకరు క్రీడా దిగ్గజమే కాదు రాజ్యసభ సభ్యుడు కూడా ... ఈపాటికే వారెవరో తెల్సి పోయే ఉండాలే ... ఇంతకీ విషయంలోకి వెళ్తే , స్మార్ట్ రాన్ అనే స్టార్టప్ సంస్థ ‘టి-ఫోన్’ అనే స్మార్టు ఫోన్ ను విడుదల చేసింది. స్మార్టు రాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. ఫోన్ ఆవిష్కరణ తరువాత ఆయన తెలంగాణ ఐటీ మంత్రి - తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడితో సెల్ఫీ దిగడం అందరినీ ఆకట్టుకుంది. ఇక స్మార్ట్ రాన్ కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు ఈ కంపెనీలో పెట్టుబడులూ పెట్టాడు. ‘ప్రారంభంలో 10000 ఫోన్లను చైనా నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తారు.. ఆ తరువాత ఇండియలోనే వీటిని తయారు చేస్తారు. ఇండియాలో తయారు చేసేందుకు ఫాక్స్ కాన్ తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సచిన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పటికే టి-ల్యాప్ టాప్ పేరుతో ఒక ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తెచ్చింది. భవిష్యత్తులో టి-అల్ట్రాటాప్ కూడా తీసుకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇంతకీ సచిన్ తనతో దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో కేటీఆర్ పోస్టు చేశారు. స్మార్టురాన్ సంస్థకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందిస్తామని ఆయన ప్రకటించారు. కాగా సచిన్ కూడా ఎప్పటిలా హైదరాబాద్ పట్ల తనకున్న అభిమానాన్ని ప్రకటించాడు . తాను కేవలం రెండే రెండు విషయాల కోసం హైదరాబాదు వస్తానని.. అవి ఒకటి క్రికెట్ - రెండోది బిరియానీ అని చెప్పాడు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్లనని కూడా అన్నాడు. కాగా సచిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ సచిన్ తనతో ఫొటో దిగడం మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. మొత్తానికి ఇద్దరికిద్దరూ తమదైన శైలి కనబరిచారు.

ఇవి కూడా చదవండి:ఇద్దరికీ లిప్ లాక్ కిస్ లిచ్చేసిన ప్రిన్స్

ఇవి కూడా చదవండి:సెక్స్ లో అలా చేసి ప్రాణాలు కోల్పోయిన లేడి డాక్టర్

English summary

Cricket God was launched a mobile phone named Smartron in Hyderabad. Sachin was brand ambassador and co- partner of this company in India. KTR taken a selfie with Sachin and posted in his Twitter Event.