కట్టప్ప..బాహుబలిని చంపడంపై కేటీఆర్‌- రానా ట్వీట్ యుద్ధం

KTR surprise tweet on Why Kattappa of Baahubali

03:51 PM ON 20th May, 2016 By Mirchi Vilas

KTR surprise tweet on Why Kattappa of Baahubali

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మే 17న రెండు రోజుల్లో ఓ పెద్ద వార్తను ప్రకటిస్తానని ట్వీట్‌ చేశారు. ఆ వార్త ఏమిటని పలువురు కేటీఆర్‌ను ప్రశ్నించారట. కొందరు సరదాగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెబుతారా.. అనీ అడిగారట. దానికి కేటీఆర్‌ ఈరోజు సమాధానం ఇచ్చారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిందీ తనకు తెలియదని, తన స్నేహితుడు రానాను అడగాలని ఆయన ట్వీట్‌ చేశారు. దీనికి రానా వెంటనే స్పందించాడు. ... ఈ ప్రశ్నకు సమాధానాన్ని మేం చిత్రీకరిస్తున్నామని నవ్వుతూ ట్వీట్‌ చేశాడు . కేటీఆర్‌ తన బిగ్‌ న్యూస్‌ సస్పెన్స్‌కి ఇలా సరదానూ జోడించి ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌ని ఆకట్టుకున్నారు.
ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సస్పెన్స్ కి తెరదించే సమయం ఇంకేతో దూరం లేనట్టే.

ఇవి కూడా చదవండి: చిరంజీవితో లేడీ ఎంఎల్ఎ రొమాన్స్

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Telangana IT Minister KTR posted a surprising tweet on his Twitter Account by saying that why Kattappa killed bahubali and he said that to ask Rana Daggubati for Answer. Rana Replied that they were filming for the answer.