కారా...మజాకా...

KTR Travels In Electric Car In America

01:28 PM ON 6th June, 2016 By Mirchi Vilas

KTR Travels In Electric Car In America

తెలంగాణా సిఎమ్ కెసిఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరిపాలనలోనే కాదు, రాజకీయ వ్యూహంలోనూ దిట్టే. ఇందుకు ఎన్నో సంఘనలు తార్కాణం. ఇప్పుడు పెట్టుబడులే లక్ష్యంగా ఈయన అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా మిడ్ వెస్ట్ పర్యటనలో భాగంగా మున్సిపల్, నగర పరిపాలన తదితర పాలన పద్ధతులను ఆయన అధ్యయనం చేశారు. సిలికాన్ వ్యాలీలో మంత్రి పర్యటన అంతా ఎలక్ట్రిక్ కారు 'టెస్లా మోడల్ ఎక్స్ ' కారులోనే సాగింది. పర్యటనలో భాగంగా తొలిరోజు నుంచి మంత్రి ఇదే కారులో పర్యటన సాగింది. తాజాగా రిలీజైన టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు విహంగంలా రెక్కల ఆకారంలో ఉన్న డోర్లు కలిగి ఉంది. కారు ముందు విండ్ షీల్డ్ కూడా పానోరామిక్ వ్యూ ఉండి అన్ని దిక్కులను ఆకాశాన్ని చూసే వెసులుబాటు కల్పిస్తుంది. స్టార్ట్ అయిన కేవలం 4సెకన్లకన్నా తక్కువ సమయంలోనే 100కి.మీ వేగాన్ని అందుకోగలుగుతుంది. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు, టిహబ్ లాంటి చోట్ల ఉన్న ఔత్సాహిక పరిశోధకులకు టెస్లా విజయప్రస్థానం స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా కె.టి.ఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:చెప్పు నుంచి చీపురుకి విస్తరించిన జగన్...

ఇవి కూడా చదవండి:యాక్సిడెంట్ లో పురుషాంగాన్ని కోల్పోయాడు... ఆ పై 70 లక్షలు ఖర్చు పెట్టి....

English summary

Telangana IT Minister KTR was now in America Tour and he travels in a electric car in whole tour and that electric car will reaches speed of 100 kilometers in just 4 seconds.