రానా ట్వీట్ కు.. కేటీఆర్ వార్నింగ్!

KTR warning to Rana tweet

10:55 AM ON 12th October, 2016 By Mirchi Vilas

KTR warning to Rana tweet

ఇద్దరు ప్రముఖుల మధ్య సాగిన మాటల సరదా అందరికీ సరదాయే కదా. ఇంతకీ వారిద్దరూ ఎవరంటే, ఒకరేమో బాహుబలి చిత్రంలో 'భళ్లాలదేవుడి'గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. మరొకరేమో ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రిగా రాణిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు. వారే రానా దగ్గుబాటి, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావులు. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. నటుడు రానా తన తండ్రి సురేష్ బాబుతో ఓ సెల్ఫీదిగి.. ఈ నిర్మాతతో తొలిసారి పనిచేస్తున్నా. ఆయనే నాన్న. త్వరలోనే మరిన్ని వివరాలు చెబుతా అని ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్ బాస్ లు. ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దు అంటూ ట్విట్టర్ వేదికగా రానాకు సలహా ఇచ్చారు. దీనిపై రానా స్పందిస్తూ కృతజ్ఞతలు సర్. అంగీకరిస్తా. అర్థం చేసుకుని అనుసరిస్తా అంటూ సమాధానమిచ్చాడు.

English summary

KTR warning to Rana tweet