3జీబీ ర్యామ్ తో రూ. 7,999కే కల్ట్‌ 10

Kult launched kult 10 smartphone in India

05:38 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Kult launched kult 10 smartphone in India

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అడుగుపెట్టింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ కల్ట్‌ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కల్ట్‌ 10 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌ ధర రూ. 7,999గా సంస్థ ప్రకటించింది. ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్‌ స్నాప్‌డీల్‌లో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఐదు అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 3జీబీ ర్యామ్, 4జీ సదుపాయం ఈ ఫోన్ ప్రత్యేకతలు. 1.3 గిగాహెడ్జ్‌ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్‌, 16జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మెమరీని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 2350 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ మార్ష్ మాలో అప్ డేట్ అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ చెపుతోంది. ప్రస్తుతం దేశంలో తమకు 500 సర్వీస్ సెంటర్లు ఉన్నాయని వెల్లడించింది.

English summary

Chineese mobile company Kult launched its new smartphone kult 10 in India. It supports 4G and the price of that smart phone is 7,999