'కుమారి' రేటు 50 లక్షలు!!

Kumari 21f heroine rate is 50 lakhs

11:18 AM ON 30th December, 2015 By Mirchi Vilas

Kumari 21f heroine rate is 50 lakhs

'అలా ఎలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌ హెబ్బాపటేల్‌. ఈ చిత్రం తో ఎటువంటి గుర్తింపు పొందని హెబ్బా, సుకుమార్‌ అందించిన కథలో హీరోయిన్‌గా నటించి ఓవర్‌నైట్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అప్పటి వరకు హెబ్బా అంటే ఎవరూ తెలియని వాళ్లు ఒక్కసారిగా హెబ్బాకి అభిమానులు అయిపోయారు. ఈ అమ్మడి పేజ్‌కి ఫేస్‌బుక్‌లో 30వేల మంది లైక్‌లు కొట్టారు. ఈమె నటన నచ్చడంతో ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఒక పాత్రని సృష్టించి మరి హెబ్బాతో నటిపంజేయించాడు. దీనితో అమ్మడు పారితోషకం పెంచేసింది. ప్రస్తుతం మంచు విష్ణు, రాజ్ తరుణ్, ఇంకా ఇద్దరు చిన్న హీరోల చిత్రాల్లో నటిస్తున్న హెబ్బా అమాంతం పారితోషకం 50 లక్షలు చేసేసింది.

50 లక్షలు ఇస్తేనే సినిమాలో నటిస్తానని కచ్చితంగా చెప్పేస్తుందట. తాజాగా ఈ అమ్మడు మ్యానేజర్ ని కూడా పెట్టుకుందని సమాచారం.

English summary

Kumari 21f heroine Hebah Patel now taking remuneration 50 lakhs for each film.