కుమారి రీమేక్‌ రైట్స్‌కి మాంచి గిరాకీ..

kumari 21f remake rights has huge response

06:29 PM ON 24th November, 2015 By Mirchi Vilas

kumari 21f remake rights has huge response

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా మారి కధ-స్క్రీప్లే అందించి 'సుకుమార్‌ రైటింగ్స్‌' బ్యానర్‌లో వచ్చిన సినిమా 'కుమారి 21 ఎప్‌' బోల్డ్‌ అండ్‌ యూత్‌ఫుల్‌ కాన్సెప్ట్‌లో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైన ఈ చిత్రానికి భారీ ఓపినింగ్సే వచ్చాయి. రాజ్‌తరుణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాస్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసులు కొల్లగొడుతుంది. ఇది యూత్‌కి నచ్చే చిత్రం కావడంతో ఇతర భాషల నిర్మాతలు కూడా ఈ చిత్రం పై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చెయ్యాలని అక్కడ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అలాగే సుకుమార్‌ని ఆ ప్రొడ్యూసర్లు రీమేక్‌ రైట్స్‌ మాకివ్వండి మాకివ్వండి అంటూ తెగ పోటీ పడుతున్నారు. సినిమాకి ఖర్చు పెట్టిన దానికంటే దానికి రెట్టింపు తిరిగి రావడంతో నిర్మాతలు కూడా ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడటం లేదట. ఈ సినిమా రైట్స్‌ని మాత్రం సుకుమార్‌ ఎవరికిస్తాడన్న విషయం తేలాల్సి ఉంది.

English summary

Creative director Sukumar's new movie Kumari 21f. which was directed by surya prathaap and story, producer was given by Sukumar.