ఎన్టీఆర్‌కు మరదలిగా 'కుమారి'!

Kumari is acting as a sister in law with Ntr

10:31 AM ON 6th January, 2016 By Mirchi Vilas

Kumari is acting as a sister in law with Ntr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో హీరోయిన్‌ కూడా నటించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. 'అలా ఎలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుని కుర్రకారుని గిలిగింతలు పెట్టిన హెబ్బా పటేల్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు చెల్లెలుగా నటించిందని సమాచారం. 'కుమారి' లో తన నటనతో ఆకట్టుకున్న హెబ్బాకి సుకుమార్‌ మరో సారి అవకాశమివ్వడమే కాకుండా తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు.

'నాన్నకు ప్రేమతో' లో హెబ్బా కనిపించేది చాలా తక్కువ సేపే అయినా హెబ్బాది చాలా ముఖ్యమైన పాత్ర అట. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకాబోతుంది.

English summary

Kumari is acting as a sister in law with Ntr in Nannaku Prematho.