'కుందనపు బొమ్మ' అసలు విడుదలవుతుందా??

Kundanapu Bomma trailer

11:10 AM ON 20th January, 2016 By Mirchi Vilas

Kundanapu Bomma trailer

షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి ఇప్పుడు హీరోయిన్ కూడా అయింది. తన మొదటి చిత్రం కేటుగాడు చిత్రం నిరాశపరచడంతో తన తరువాత చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. చాందిని చౌదరి హీరోయిన్ గా, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్ ముక్కాముల హీరో గా తెరకెక్కిన చిత్రం 'కుందనపు బొమ్మ'. ఈ చిత్రానికి వర ముళ్ళపూడి దర్శకత్వం వహించగా, యం.యం. కీరవాణి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్, పాటలు ఎప్పుడో విడుదల చేసినా కొన్ని కారణాల వల్ల సినిమా ని విడుదల చెయ్యలేదు. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కి సిద్ధమవుతుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నామని ఈ చిత్రం డైరెక్టర్ వర ముళ్ళపూడి తెలిపారు.

English summary

Kundanapu Bomma movie trailer. Chandini Choudary and Sudhakar Mukkamala is acting in lead roles. Vara Mullapudi is directing this movie. M.M. Keeravani is composed music to this film.