కువైట్ లో నౌకర్ పై చిత్ర హింసలు(వీడియో)

Kuwait house owner thrashed a house keeper

10:53 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Kuwait house owner thrashed a house keeper

ఏదేశమైనా సరే నౌకర్లను చిత్ర హింసలు పెట్టే ఘటనలు వింటూంటాం. ఇక గల్ఫ్ దేశాల్లో అయితే తమ ఇళ్ళలో పని చేసే పని మనుషులమీద యజమానుల దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. విచక్షణా రహితంగా వారిని చావబాదుతున్నారు. వీరిని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేకపోవడమే కాదు రక్షించే నాథుడే లేకుండా కరువైపోతున్నాడు. ఇటీవల కువైట్ లో ఓ నౌకర్ మీద ఆ ఇంటి యజమాని, అతని బంధువు జరిపిన అమానుష దాడి దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధితుడు చెబుతున్న వివరణను కూడా పట్టించుకోకుండా వాళ్ళు అతడిని దాదాపు చిత్ర హింసలకు గురిచేసారు. అందుకే గల్ఫ్ దేశాల్లో.. ఇళ్లలో పని చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ వీడియో అందరికీ చెప్పే పాఠం.

English summary

Kuwait house owner thrashed a house keeper