సిక్స్ ప్యాక్ ల కోసం ఈ మగాళ్లు చేసే పని ఇదా?!

Kuwait teenage boys using steroids for six pack

01:16 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Kuwait teenage boys using steroids for six pack

రాను రాను పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు వ్యవహారం తయారయింది. ఇక ఫిట్ నెస్ కోసం ఎక్సర్ సైజులు, జాగింగ్, వాకింగ్ వంటివి కొందరు చేస్తుంటారు. మరింకొందరు జిమ్ కు కూడా వెళ్తుంటారు. అయితే, ఇక్కడ మాత్రం, సిక్స్ ప్యాక్ బాడీ కోసం లేనిపోని తిప్పలు తెచ్చుకుంటున్నారు. శరీర శౌష్టవం కోసం, సిక్స్ ప్యాక్ బాడీ కోసం కువైట్ యువత స్టెరాయిడ్స్ వాడుతోందని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా జిమ్ లో ఈ స్టెరాయిడ్స్ ను యువత ఎక్కువగా వాడుతోందని తేలింది. అనాబలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ ను జిమ్ సెంటర్లో కువైట్ యువత ఎక్కువగా వాడుతున్నారని పురుషుల ఆరోగ్య వివరాలను ప్రచురించే అంతర్జాతీయ మెడికల్ జర్నల్ తేల్చింది.

ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల శరీర సౌష్టవం వచ్చినా చాలా దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మొత్తం 200 మంది కువైట్ యువకులపై ఈ పరిశోధన చేశారు. వారి రక్త నమూనాలను పరిశీలించారు. వీరిలో 80 శాతం మంది ఈ స్టెరాయడ్స్ వాడుతున్నట్లు తేలింది. ఈ స్టెరాయిడ్స్ వాడకం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ శాతం తగ్గిపోతుందని, తద్వారా భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు వస్తాయని అంతర్జాతీయ మెడికల్ జర్నల్ తేల్చి చెప్పేసింది.

English summary

Kuwait teenage boys using steroids for six pack