ఈ మృత్యుంజయుడు... ఎన్నిసార్లు చచ్చి బతికాడో తెలిస్తే షాకౌతారు!

Kyle Cook was escaped several times from death

06:16 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Kyle Cook was escaped several times from death

ఇతనో మృత్యుంజయుడు. చాలాసార్లు చనిపోయి బతికాడు. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజంగా నిజం. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికా ఓర్లాండోలోని లీక్ ల్యాండ్ కు చెందిన కైలె కుక్(31) ఇప్పటికి చాలాసార్లు చావు అంచుల్లోకి వెళ్లి మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. ఆగష్టు 11వ తేదీన తన కుటుంబంతో అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలో పెరిగిన గడ్డిని కోస్తుండగా పాము బుసకొడుతున్న శబ్ధం వినిపించింది. అయితే ఏ కీచురాయి అరుపో అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత కాసేపటికే దాదాపు ఐదడుగులు ఉన్న పెద్ద పాము మూడుడుగుల దూరంలో ఉండి బుసలు కొడుతోంది. అది చూసిన కుక్ కు పై ప్రాణాలు పైనే పోయాయి. దానినుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా వెనక్కి గెంతాడు.

1/4 Pages

పాము అంతకంటే వేగంతో అతడి కుడి మోకాలను చుట్టుకుని చటుక్కున కాటేసింది. వెంటనే లబోదిబోమంటూ ఆస్పత్రికి పరుగెత్తాడు. వైద్యులు వెంటనే చికిత్స చేసి కాటును పరిశీలించారు. కాటును కొవ్వుతో ఉన్న నరాలు అడ్డుకోవడంతో పాము విషం రక్తంలోకి వెళ్లలేదని చెప్పి యాంటీవీనమ్ ఇచ్చి పంపించారు. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఈ ఘటన జరిగిన మర్నాడు అంటే ఆగస్టు 12న ఓ ట్రక్కును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటి తర్వాత పెద్ద తూఫాన్ రావడంతో వాహనాన్ని ఆపేశాడు. అయితే అతడికి పదడుగుల దూరంలో పడిన పెద్ద పిడుగు పడింది. దాని దాటికి అతడు పెద్దెత్తున ఎగిరిపడ్డాడు. మైక్ టైసన్ పెద్ద సుత్తితో నా దవడపై కొట్టినట్టు అనిపించింది అని అప్పటి ఘటనను కుక్ వివరించాడు.

English summary

Kyle Cook was escaped several times from death