ఛానల్ పెడుతున్న ఎల్బీ శ్రీరామ్

L B Sriram starting channel in Youtube

05:06 PM ON 17th May, 2016 By Mirchi Vilas

L B Sriram starting channel in Youtube

ఎల్బీ శ్రీరామ్ మొదట మాట‌ల ర‌చ‌యిత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత కమెడియన్ గా స్ధిర పడి తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇండ‌స్ర్టీలో 25 ఏళ్ల‌గా నటుడిగా కొనసాగుతున్న ఎల్బీ శ్రీరామ్ ఇప్పుడు మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న ఓ ఛానల్ పెడుతున్నారు. ఏంటి ఎల్బీ శ్రీరామ్ ఛానల్ పెడుతున్నాడా? అతని దగ్గర అన్ని డబ్బులున్నాయా? అంత ఎక్స్పీరియన్స్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా! అయితే మీరు తప్పులో కాలు వేసినట్లే. ఆయన పెడుతోంది టీవీ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో ప్రదర్శించాలని ఆయన ఆలోచన.

ఇక్కడ ఎల్. బి. అంటే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని అర్ధమట. ఆ కాన్సెప్ట్ మీదే ఆయ‌న షార్ట్ ఫిలిమ్స్ తీస్తాడ‌ట‌. ఇక షార్ట్ ఫిలిమ్స్ గురించి ఆయన మాట్లాడుతూ.. త‌న‌ ఫీలింగ్స్ గుండెలోంచి వ‌చ్చిన‌వి కాబ‌ట్టే ఈ షార్ట్ ఫిలిమ్స్ కు 'హార్ట్ ఫిలిమ్స్' అని పేరు పెట్టుకున్నాను అని చెప్పారు. మే 30న ఎల్బీ శ్రీరామ్ పుట్టిన‌రోజు. ఆ రోజు త‌న సెకండ్ ఇన్సింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తానని ఆయన చెప్తున్నారు..

English summary

L B Sriram starting channel in Youtube. Star comedian L B Sriram starting channel in Youtube. And hes will release short films in that channel.