బ్రిటన్ లో మహిళా ఎంపీ దారుణ హత్య

Labour MP Jo Cox dies after being shot

11:07 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Labour MP Jo Cox dies after being shot

ఇదో దారుణం .. బ్రిటన్ లో లేబర్ పార్టీకి చెందిన ప్రముఖ మహిళా ఎంపీ జో కాక్స్ ను ఓ దుండగుడు దారుణంగా హత్య చేశాడు. 41 ఏళ్ళ ఆమెపై కత్తి తో దాడి చేసి, తుపాకితో కాల్చేశాడు దీంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జో కాక్స్ ను 52 ఏళ్ళ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. వెస్ట్ యార్క్ షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికైన జో కాక్స్ బ్రిటన్..యూరోపియన్ యూనియన్ లోనే కొనసాగాలన్న వాదానికి మద్దతునిస్తోంది. దీంతో మూడు నెలలనుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఆమెకు మొబైల్ కాల్స్ వచ్చాయని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. అయితే డుండగుడ్నిపోలీసులు అరెస్టు చేశారు. జో కాక్స్ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ వ్యక్తి ఈ కిరాతకానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి:కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి:మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

ఇది కూడా చూడండి:హీరోలు వారి మేనరిజం

English summary

Labour MP Jo Cox dies after being shot.