డిసెంబర్ 11న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'

lachchindeviki o lekkundi releasing on december 11

05:10 PM ON 26th November, 2015 By Mirchi Vilas

lachchindeviki o lekkundi releasing on december 11

దర్శకధీర రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రాన్ని షార్ట్‌గా పిలవడానికి 'లోల్‌' అని కింద ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా అందాల రాక్షసి తో హిట్‌ పెయిర్‌గా క్రేజ్‌ పొందిన నవీన్‌ చంద్ర-లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్నారు. 'లోల్‌' కి యమ్‌.యమ్‌. కీరవాణీ సంగీతం అందించారు. ఈ సినిమా ఘాటింగ్‌తో పాటు నిర్మాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 11న విడుదల చెయ్యడానికి డేట్‌ ఫిక్స్‌ చేశారు.

ఈ సినిమా ఆడియోకి రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేయడంతో సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్‌ కామెడీ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని దర్శకుడు జగదీష్‌ తలసిల నమ్మకంగా చెప్పారు.

English summary

lachchindeviki o lekkundi releasing on december 11 which was directed by s.s.rajamouli disciple jagadeesh talasila was directed this movie.