వనితల కొలతలు కొలుస్తూ అడ్డంగా బుక్కయ్యారు...

Lady Candidates Medical check up from Male Police

07:27 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Lady Candidates Medical check up from Male Police

పోలీస్ , ఫారెస్ట్ గార్డు తదితర ఉద్యోగాలకు ఆడవాళ్ళను తీసుకునే టప్పుడు కొలతలు తీసుకున్నా , మరేం చేసినా సాధారణంగా మహిళల చేత చేయిస్తారు. కానీ ఇక్కడ పురుషులే ఆడ్యూటి చేసేస్తున్నారు. దీంతో ఉద్యోగం కోసం వచ్చిన సదరు అభ్యర్ధులు అడ్డు చెప్పలేక , పైకి చెప్పుకోలేక నరక యాతన పడ్డారు. ఇంతకీ ఇది ఎక్కడంటే రాజస్తాన్ లో ... వివరాల్లోకి వెళ్తే చిత్తోర్ గడ్ జిల్లాలో మహిళా ఫారెస్ట్ గార్డు ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్దినుల నుంచి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లోని పురుష ఉద్యోగులు కొలతలు తీసుకున్నారు. శ్వాస తీసుకోమని , శ్వాస వదిలి పెట్టమని పదే పదే అడుగుతూ కొలతలు తీసుకోవడం ఇప్పుడు దుమారం రేపుతోంది . పైగా ఉన్నతాధికారులు , మహిళా కానిస్టేబుల్ సమక్షంలో జరగడం మరీ దారుణం.ఈ అంశం దేశ వ్యాప్తంగా దుమారం రేపడంతో, ఆ రాష్ట్ర అటవీ మంత్రి రాజ్ కుమార్ రిన్వా స్పందిస్తూ, ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకుంటామని చెబుతూ , దర్యాప్తునకు ఆదేశించారు.

English summary

Rajasthan Forest Department recruitment 2015 for Forest Guards(Lady Candidates Medical check up from Male Police Person in Chittorgarh).Now this was going contreversial in India.