మంత్రి పదవి ఆశిస్తూ బిర్యాని విందిచ్చిన మహిళా ఎమ్మెల్యే

Lady MLA Parameswari gave a biryani party for minister post

05:27 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Lady MLA Parameswari gave a biryani party for minister post

రాజకీయాలు ఎలా రూపాంతరం చెందాయో, ఈ ఘటన రుజువుచేస్తోంది. తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం అన్నాడీఎంకే శాసనసభ్యురాలు పరమేశ్వరి మంత్రి పదవిని ఆశిస్తూ తన ఇష్టదైవమైన సట్టికరుప్పు ఆలయంలో భారీ స్థాయిలో బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా 25 మేకపోతులు, 250 కోళ్లను బలి ఇచ్చింది. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు సహా సుమారు 3 వేల మందికి బిర్యానీ విందు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు, అన్నాడీఎంకే పాలన వందరోజులు ముగిసినందుకు ఈ విందు ఏర్పాటు చేశానని పరమేశ్వరీ పైకి చెబుతున్నప్పటికీ, తనకు మంత్రి పదవి రావాలని అమ్మవారిని కోరుతూ ఈ విందు ఇచ్చారని పార్టీ స్థానిక శాఖ నాయకులు చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ అన్నాడీఎంకే మహిళా శాసనసభ్యురాలు ఒకేసారి మూడు వేలమందికి బిర్యానీ విందు ఏర్పాటు చేయడం తారాపురంలో సంచలనం కలిగించింది. మరి సీఎం జయలలిత ఎలా స్పందిస్తారో చూడాలని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: రూ. 1000కే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ కాలేజీ అమ్మాయిలు..

ఇది కూడా చదవండి: అక్కడ ఆడవారి కోర్కెలు తీర్చడానికి మగవారు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా? అయితే ఒకసారి ఇది చదవండి..

English summary

Lady MLA Parameswari gave a biryani party for minister post. Chennai MLA Parameswari gave a biryani party for Minister post.