మహిళను నగ్నంగా ఊరేగించారు - జైలు పాలయ్యారు

Lady Naked In Mumbai

03:00 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Lady Naked In Mumbai

ఎన్ని చట్టాలున్న మహిళలపై దాడులు , వేధింపులు , అత్యాచారాలు ఆగడంలేదు. ఇదే కోవలో గతంలో చోటుచేసుకున్న దారుణ ఘటనలో మొత్తం 12 మందికి జైలు శిక్ష విధిస్తూ, కోర్టు తీర్పు చెప్పింది. ఓ కిరాతక అన్న చేసిన తప్పుకి 22 ఏళ్ల మహిళ బట్టలను ఊడదీసి, కొట్టి హిసించడంతో పాటూ నగ్నంగా ఆమెను ఊరేగించిన 11 మంది మహిళలతో పాటు మరో వ్యక్తికి ముంబైలోని సెషన్స్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది.

సభ్యసమాజం తలదించుకునే విధంగా ఓ మహిళపై సాగిన దాడి ఘటన వివరాలిలా ఉన్నాయి. 2010, జూన్ 17న బాధితురాలిపై దాడి చేసి అత్యంత దారుణంగా కొట్టి నడిరొడ్డుపై నగ్నంగా ఊరేగించారు. విషయమేమంటే . ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు బాధితురాలి అన్నయ్య నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అన్న చేసిన తప్పుకు బాలిక బంధువులు రెచ్చిపోయారు. బాధిత మహిళను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి ఆమెను అందరూ చూస్తుండగా ఆమె ను నగ్నంగా చేసి , దాడి చేసారు. నడిరోడ్డులో అలానే ఊరేగించారు. అత్యంత దారుణంగా నిందితులు ప్రవర్తించిన తీరు పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి బాధిత మహిళ పట్ల బాలిక బంధువులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పేర్కొంటూ , ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధితురాలి పై దాడి చేసి, ఆమె మనోభావాలను దెబ్బ తీసేలా ప్రవర్తించినందుకు నిందుతులకు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

English summary