అసెంబ్లీ దగ్గరే మహిళా ఎస్సై ఆత్మహత్యాయత్నం

Lady SI suicide attempt at assembly

12:15 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Lady SI suicide attempt at assembly

దేశంలో ఎలాంటి దారుణ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయో ఇలాంటి ఘటనలు రుజువుచేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం విధులకు హాజరైన ఓ మహిళా ఇనస్పెక్టర్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కలకలం సృష్టించింది. ఇటీవల అసెంబ్లీలో ప్రతిపక్ష- అధికార పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట అధికమవ్వడంతో భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడకు వచ్చిన మహిళా ఇనస్పెక్టర్ హఠాత్తుగా శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. చివరి నిమిషంలో గుర్తించిన భద్రతాధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇంతకీ ఈమె తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్సై కాంచన అని విచారణలో తేలింది.

కాంచన పలు క్రీడా పోటీల్లో పాల్గొన్ని 350 బంగారు పతకాలను సాధించారు. ధైర్యసాహసాలకు మారు పేరుగా ఆమె పలు ప్రభుత్వ అవార్డులు కూడా పొందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొద్ది రోజులుగా తిరువొత్తియూర్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ తో ఆమెకు మనస్ఫర్థలు ఏర్ప డ్డాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి తిరువొత్తియూర్ మహిళా పోలీసుస్టేషన్ కార్ పార్కింగ్ లో కాంచన కారు నిలిపారు. ఆమె కారుకు అడ్డంగా ప్రకాష్ కారు నిలపడంతో ఈ విషయంలోనూ వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కాంచన డిప్యూటీ, సహాయ కమిషనర్, సహాయ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు.

అయినా ఫలితం లేకపోవడంతో ఆవేదన చెందిన కాంచన సచివాలయం దగ్గరకు వచ్చి ఆత్మహత్యకు యత్నించినట్లు విచారణలో తెలిసింది. ఈ సంఘటనతో జార్ట్ కోటలోని 4వ గేటు ప్రవేశ మార్గాన్ని అధికారులు మూసివేశారు.

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

ఇది కూడా చదవండి: అద్భుత వ్యక్తి పవన్... లోకేష్ ట్వీట్

ఇది కూడా చదవండి: ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

English summary

Lady SI suicide attempt at assembly