ఓ ఎబ్బో లగడపాటి చెప్పిందే జరిగిందట

Lagadapati Astrology CameTrue

01:06 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Lagadapati Astrology CameTrue

ఎన్నికల ఫలితాలపై సర్వేల మీద సర్వేలు జరిపించడంలో దిట్టగా నిల్చిన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ 'బీహార్' ఎన్నికల నేపధ్యంలో మరోసారి వార్తల్లోకెక్కారు. బీహార్ లో ఆర్జేడీ నేత నితీశ్ కుమార్‌ సారథ్యంలోని మహా కూటమియే అధికారంలోకి వస్తుందని ఆయన ముందే పసిగట్టారట. గత పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోదీదే హవా అని అందరికన్నా ముందే ఈయన చెప్పారంట కదా. గతంలో యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేయడంతో, బిహార్‌లో మొదటిసారి సర్వే చేయడంతో లగడపాటి కి మంచి అనుభవం కూడా వచ్చిందట. ఏలూరుకు చెందిన ఆర్జీ ప్లాష్‌ టీమ్‌ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలో నిజానికి మొదట మహాకూటమికి 160 సీట్లకు పైగా వస్తాయని అంచనాకు వచ్చినప్పటికీ, అయితే మోదీకి వచ్చిన జనాన్ని చూసి కొంత సీట్ల సంఖ్యను కుదించారట. నితీశ్‌ పాజిటివ్‌ ఇమేజ్‌పైన దెబ్బ కొట్టాలని చూడటంతో పాటు రిజర్వేషన్లను పునఃసమీక్షించాలన్న ఆర్‌ఎస్ఎస్‌ ఛీప్‌ భగవత్‌ వ్యాఖ్యల వల్ల బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అందుకే లాలూ - నితీష్ కూటమి అనూహ్య విజయం సాధించిందని లగడపాటి చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి నితీశ్‌ హయాంలో శాంతి భద్రతల సమస్యలు లేవనీ, మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించారని, స్కూల్‌ పిల్లలకు సైకిళ్ల పంపిణీ కూడా నితీశ్‌ కూటమి విజయానికి దోహదపడ్డాయని లగడపాటి విశ్లేషించారు. మోడి సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఓట్లు రాకపోవడానికి కారణం అక్కడి బిజెపి నేతలను పట్టించుకోకపోవడమేనని , మోడి హవాను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో క్రిందిస్థాయి నాయకత్వం విఫలమైందని ఆయన వాదన. ఏది ఏమైనా ఈమధ్య వార్తల్లో లేని లగడపాటి బీహార్ ఎన్నికలతో వార్తల్లోకి ఎక్కారు.

English summary

Lagadapati Astrology CameTrue